ఢిల్లీ వీధుల్లో న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ గల్లీ క్రికెట్..! 1 y ago
న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్ ప్రస్తుతం భారత్ లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీ వీధుల్లో అక్కడి పిల్లలతో కలిసి క్రికెట్ ఆడుతూ కాసేపు సరదాగా గడిపారు. ప్రధానితో పాటు కివీస్ మాజీ క్రికెటర్ రాస్ టేలర్ కూడా ఉన్నారు. దింతో రెండు దేశాలను ఏకం చేయడంలో క్రికెట్ ను మించినది లేదంటూ క్రిస్టోఫర్ లక్సన్ ట్వీట్ చేశారు. ఆయన క్రికెట్ ఆడిన ఫొటోలను పంచుకున్నారు.